27 వరకు గ్రహణ మొర్రికి ఉచిత శస్త్రచికిత్సలు
పుట్టుకతోనే గ్రహణం మొర్రి, అంగిలి విచ్చేదనం తదితర ఇబ్బందులతో భాధ పడుతున్న చిన్నారులకు శుభవార్త. వారికీ ఉచితంగా చికిత్సలు చేసేందుకు కెనడాకు చెందిన వైద్య బృందం ముందుకొచ్చింది. ఆరు నెలల నుంచి 15 ఏళ్ళలోపు బాలబాలికలకు ఈ చికిత్సలు చేయనున్నారు. ఇందుకోసం 27 మందితో కూడిన వైద్య బృందం శనివారం హైదరాబాద్ చేరుకొంది. హైదరాబాద్ పురానాహవెలీలొని ప్రిన్సెస్ దుర్రె ఫర్ చిల్డ్రన్స్ జనరల్ ఆసుపత్రిలో చిన్నారులకు ఆ ఉచిత చికిత్సలు చేయనున్నట్లు అంతర్జాతీయ మనవ హక్కుల సంస్థ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాజన్ ముదిరాజ్ తెలిపారు. కెనడాకు చెందిన ది ఆపరేషన్ రెయిన్బో అనే సంస్థ అద్వర్యంలో వీటికి సంభందించిన ఏర్పాట్లు చేశారు. శాస్త్రచికిత్సలతో పాటు వాటికి కావలసిన వైద్య పరీక్షలు, మందులు కూడా ఉచితంగా అందజేస్తారు. ప్లాస్టిక్ సర్జన్లు, చిన్న పిల్లల వైద్య నిపుణులు, అనస్తిషియన్లతో కూడిన బృందం ఈ నెల 27 వరకు హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారు. శస్త్రచికిత్సలు అవసరమైన పిల్లల తల్లి తండ్రులు రిజిస్ట్రేషన్ల కోసం 040-24520548, 24526155 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు
No comments:
Post a Comment