Friday 7 February 2020

బెంగళూర్,హైద్రాబాద్, చెన్నై లోని ఆరోగ్యశ్రీ కిందకు వచ్చే ఆసుపత్రుల వివరాలు.. అందరికీ షేర్ చేయండి.















Sunday 21 October 2018

27 వరకు గ్రహణ మొర్రికి ఉచిత శస్త్రచికిత్సలు

27 వరకు గ్రహణ మొర్రికి ఉచిత శస్త్రచికిత్సలు

పుట్టుకతోనే గ్రహణం మొర్రి, అంగిలి విచ్చేదనం తదితర ఇబ్బందులతో భాధ పడుతున్న చిన్నారులకు శుభవార్త. వారికీ ఉచితంగా చికిత్సలు చేసేందుకు కెనడాకు చెందిన వైద్య బృందం ముందుకొచ్చింది. ఆరు నెలల నుంచి 15 ఏళ్ళలోపు బాలబాలికలకు ఈ చికిత్సలు చేయనున్నారు. ఇందుకోసం 27 మందితో కూడిన వైద్య బృందం శనివారం హైదరాబాద్ చేరుకొంది. హైదరాబాద్ పురానాహవెలీలొని ప్రిన్సెస్ దుర్రె ఫర్ చిల్డ్రన్స్ జనరల్ ఆసుపత్రిలో చిన్నారులకు ఆ ఉచిత చికిత్సలు చేయనున్నట్లు అంతర్జాతీయ మనవ హక్కుల సంస్థ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాజన్ ముదిరాజ్ తెలిపారు. కెనడాకు చెందిన ది ఆపరేషన్ రెయిన్బో అనే సంస్థ అద్వర్యంలో వీటికి సంభందించిన ఏర్పాట్లు చేశారు. శాస్త్రచికిత్సలతో పాటు వాటికి కావలసిన వైద్య పరీక్షలు, మందులు కూడా ఉచితంగా అందజేస్తారు. ప్లాస్టిక్ సర్జన్లు, చిన్న పిల్లల వైద్య నిపుణులు, అనస్తిషియన్లతో కూడిన బృందం ఈ నెల 27 వరకు హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారు. శస్త్రచికిత్సలు అవసరమైన పిల్లల తల్లి తండ్రులు రిజిస్ట్రేషన్ల కోసం 040-24520548, 24526155 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు

Thursday 27 September 2018

మలబద్దకం నిరోధించుట కొరకు సులభ యోగాలు

ఈ మధ్యకాలం లో చాలా మంది ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మలవిసర్జన కు వెళ్తున్నాం మాకు మలబద్దకం లేదు అని అనుకుంటున్నారు . కాని అది సరియయినది కాదు . ఆరోగ్యవంతమైన మానవుడు రోజుకి రెండు సార్లు మలవిసర్జన చేయవలెను అని ఆయుర్వేద గ్రంథాలలో స్పష్టంగా ఉంది.
మలబద్దకం అనేది మానవ శరీరంలో వ్యాధులు ప్రారంభం అవుటకు మొదటి మెట్టు . మలబద్దకం ప్రారంభం అయిన వెంటనే గ్యాస్ సమస్య కూడా మొదలు అవుతుంది. కావున మలబద్ధకం అనే సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరించుకోవలెను .
ఈ మలబద్దకం అనే సమస్య పరిష్కరించుకొనుటకు కొన్ని సులభ పద్దతులు మీకు తెలియచేస్తాను .

పద్దతులు :

1. మిరియాలను నూరి చూర్ణం చేసి అరటిపండుతో అద్దుకొని భుజిస్తే మలబద్దకం తగ్గును. చిటికెడు మిరియాల చూర్ణం చాలు .
2. తెల్ల తెగడ ఆయుర్వేద షాపుల్లో దొరకును . దానిని పాలల్లో ఉడికించి ఎండబెట్టి చూర్ణం చేసి అణా ఎత్తు చూర్ణాన్ని అనుదినం సేవిస్తున్న యెడల మలబద్దకం పోతుంది .
3. మాచిపత్ర ఆకుల కషాయం తాగుతున్న మలబద్దకం నివారణ అగును.
4. సీతాఫలం వేరు నూరి ఆ రసాన్ని తీసి తాగిన సుఖవిరేచనం అగును.
5. కాకరకాయ కూర భోజనంలో కొంచంగా తింటూ ఉంటే సుఖవిరేచనం అవుతుంది.
6. ఎండిన ఎర్ర రేగిపళ్ళు గాని , వాటి వడియాలు గాని తింటూ ఉంటే సుఖవిరేచనం అగును.
7. ప్రతిపూటా కొంచం చింతపండు తింటూ ఉన్నా సుఖవిరేచనం అగును. ఎక్కువ తినినచో విరేచనాలు అగును. అందుకే మలబద్దకం లేకుండా ఉండుటకు రోజూ చాలా మంది భోజనంతో చింతపండు చారు కప్పుడు తాగుతారు.
8. బాగుగా మిగుల పండిన అరటిపండ్లు మూడు అరటిపండ్లు తినినచో సుఖవిరేచనం అగును. పచ్చి అరటిపండు తింటే విరేచనాలు తగ్గును.
9. నాగజెముడు , ఆకుజెముడు , బొంతజెముడు వీటిలో ఏ రకమైన జెముడు రసం పది చుక్కలు తీసుకుంటే విరేచనాలు అవుతాయి . అయిదు చుక్కల మోతాదు సరిపోతుంది.
10. ఇంగువ కుంకుడు గింజ అంత లొపలికి తీసుకున్నచో కడుపులో ఉన్న మలం అంతా బయటకి వెళ్లి కడుపు శుభ్రం అగును.
11. సునాముఖి చూర్ణం ఒక చెంచా మోతాదు నిద్రకు ఉపక్రమించబోయే సమయాన ఒక గ్లాస్ గొరువెచ్చటి నీటిలో కలిపి తీసుకున్నచో ఉదయానికి సుఖవిరేచనం అయ్యి వ్యర్థాలు బయటకి వెళ్లును.
మీ ఆహరం యొక్క అరుగుదల , మీ యొక్క మోషన్ సిస్టం సక్రమంగా ఉంచుకున్నచో మీకు అనారోగ్య సమస్యలు అంతతొందరగా దరిచేరవు .

Thursday 14 June 2018

Tuesday 29 May 2018

Tuesday 28 November 2017

నిమ్స్‌ యాప్‌!


*📣నిమ్స్‌ యాప్‌!*

*🚸క్యూలైన్‌ ఉండదు.. అంతా ఆన్‌లైన్‌*
*📱మీ మొబైల్‌ నుంచే ఓపీ రిజిస్ట్రేషన్‌*
*రిపోర్టుల కోసం చుట్టూ తిరగక్కర్లేదు*
*🔰నేటి నుంచి అందుబాటులోకి యాప్‌*
*3 కోట్ల ‘ఈబస్‌ ఎండోస్కోపీ’ యూనిట్‌*
*💐నేడు ప్రారంభించనున్న మంత్రి*
*🏥నిమ్స్‌లో వైద్యం కోసం ఇక గంటలు తరబడి నిల్చోవాల్సిన పని లేదు. పడిగాపులు కాసి సొమ్మసిల్లి పడిపోయే ప్రమాదమూ ఉండదు. టైం అయిపోయిందని రోగులను తిప్పి పంపే పరిస్థితులకూచెక్‌ పడినట్టే. రక్త, మూత్ర పరీక్షల రిపోర్టుల కోసం కాళ్లరిగేలా తిరగక్కర్లేదు. అవి మీ చెంతకే వస్తాయి. ఈ మార్పు సర్కారు ఆధ్వర్యంలో నడిచే నిమ్స్‌ ఆస్పత్రిలో ఎలా సాధ్యమనేగా మీ అనుమానం! ఓపీ రిజిస్ట్రేషన్‌, రిపోర్టుల కోసం నిమ్స్‌ ప్రత్యేకంగా ఒక ‘యాప్‌’ రూపొందించింది. ఇది సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఇక నుంచి పేషెంట్లకు సంబంధించిన నివేదికలను రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో ఉంచుతారు.*
*🛡యాప్‌ ఎలా పని చేస్తుందంటే..*
*📱స్మార్ట్‌ ఫోన్లున్న వారు గూగుల్‌ ప్లేస్టోర్‌కి వెళ్లి నిమ్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ అడిగే రోగి వివరాలను నమోదు చేయాలి. వెంటనే తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఒకటి వస్తుంది. ఓపీ కౌంటర్‌కు వెళ్లి ఆ నంబరు చెప్పి డబ్బు చెల్లిస్తే ప్రింటవుట్‌ ఇస్తారు. ఇదంతా రెండు మూడు నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఇంటి దగ్గర నుంచి కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఓపీ నమోదు చేసుకోవాలంటే ఉదయమే నిమ్స్‌కు వెళ్లి క్యూ కట్టాలి. గంటల తరబడి నిలుచోవాలి. ఒక్కోసారి టైం అయిపోయిందని తిప్పి పంపిన సందర్భాలూ ఉంటున్నాయి. యాప్‌తో ఆ కష్టాలు తీరినట్టే.*
*🔘రిపోర్టులు సర్వర్‌లో నిక్షిప్తం*
*ఇప్పటిదాకా నిమ్స్‌లో రక్త, మూత్ర పరీక్షల కోసం ఉదయం శాంపిల్స్‌ ఇస్తే సాయంత్రానికో మరుసటి రోజుకో రిపోర్టులు ఇస్తున్నారు. ఒక్కోసారి రిపోర్టులు రాక నిమ్స్‌లోని బిల్డింగుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. పేషెంట్లకు ఈ తిప్పలు తప్పినట్టే. సోమవారం నుంచి రోగులకు సంబంధించిన అన్ని రిపోర్టులను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. వాటిని పేషెంట్లు మొబైల్‌ ఫోన్‌లోనే చూసుకోవచ్చు. వైద్యుడి దగ్గరకు వెళ్లినప్పుడు కూడా వారు రిపోర్టులు అడగరు. రోగికి ఇచ్చిన శాశ్వత రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా కంప్యూటర్‌లోనే వాటిని పరిశీలిస్తారు. రోగుల రిపోర్టులన్నీ శాశ్వతంగా నిమ్స్‌ ఆస్పత్రి సర్వర్‌లో నిక్షిప్తమై ఉంటాయి. రిపోర్టులు పోవడం, మరచిపోవడమనే ప్రసక్తి ఉండదు.*
*3 కోట్ల ‘ఈబస్‌ ఎండోస్కోపీ’*
*🔹కార్పొరేటు ఆస్పత్రుల్లో సైతం లేని అత్యాధునిక వైద్య పరికరం హైదరాబాద్‌ నిమ్స్‌లో అందుబాటులోకి వస్తోంది. ‘ఈబస్’గా వ్యవహరించే ఎండోబ్రాంకియల్‌ అల్ట్రాసౌండ్‌ యూనిట్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రుల్లో ఇంతటి ఖరీదైన మిషనరీ ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. ఈబస్ తోపాటు లంగ్‌ డిఫ్యూజన్‌ మిషన్‌సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి*.
*💠ఈబస్‌ ఎండోస్కోపీ యూనిట్‌ ఖరీదు రూ.3 కోట్లు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఇతర ఛాతీ వ్యాధులు, శోషగ్రంథుల్లో వాపు వంటి వాటిని తేలిగ్గా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని నోటి ద్వారా పంపించి బయాప్సీ చేస్తారు. ఇప్పటివరకు బ్రాంకోస్కోపీ నిర్వహిస్తున్నా శ్వాసనాళాల లోపల ఉన్న గడ్డలు కనిపించేవి కావు. ఈబస్‌ ఎండోస్కోపీతో వాటినిసైతం కనుగొనవచ్చు. శ్వాసనాళాల బయట ఏమున్నదీ తెలుసుకోవడం తేలికవుతుంది. ఏమైనా గడ్డ ఉందా? లేక కేన్సర్‌, టీబీ సోకిందా తెలుసుకోవడం సాధ్యపడుతుంది. ఇప్పటివరకు ఇటువంటి గడ్డలను తొలగించాలంటే ఛాతీని ఓపెన్‌ చేయాల్సి వచ్చేది. ఈబ్‌సతో కోత లేకుండానే తొలగించవచ్చు.*
*సమయం, డబ్బు ఆదా*
*🔸ఈబస్‌ ద్వారా ఊపిరితిత్తుల్లోని శ్వాస నాళాల బయట గోడలకు ఉండే గడ్డలను గుర్తించి తొలగించవచ్చు. ఈ ఆపరేషన్‌ చేయాలంటే నాలుగైదు గంటలు పడుతుంది. ఈబ్‌సతో కేవలం గంటన్నరలో పూర్తి చేసి... పేషెంట్‌ను అదే రోజు డిశ్చార్చి చేయవచ్చు. సాధారణంగా కనీసం నాలుగైదు రోజులు పేషెంట్‌ ఆస్పత్రిలోనే ఉండాల్సి వుంటుంది. మా దగ్గర ప్రత్యేకత ఏమిటంటే ఈబస్‌ ఎండోస్కోపీకి వాడే నీడిల్‌ను ఒక్కరికే వాడతాం. దీని ఖరీదు 13 వేల వరకు ఉంటుంది.*
- డాక్టర్‌ మనోహర్‌, నిమ్స్‌ డైరెక్టర్‌

Featured post

నిమ్స్‌ యాప్‌!

* 📣 నిమ్స్‌ యాప్‌!* * 🚸 క్యూలైన్‌ ఉండదు.. అంతా ఆన్‌లైన్‌* * 📱 మీ మొబైల్‌ నుంచే ఓపీ రిజిస్ట్రేషన్‌* * ♦ రిపోర్టుల కోసం చుట్టూ తిరగక్కర్...