Free Medical & Health Services
we will provide information about Hospital Details of Free Medicine and Health checkups and Surgeries through all over INDIA
Friday, 7 February 2020
Sunday, 21 October 2018
27 వరకు గ్రహణ మొర్రికి ఉచిత శస్త్రచికిత్సలు
27 వరకు గ్రహణ మొర్రికి ఉచిత శస్త్రచికిత్సలు
పుట్టుకతోనే గ్రహణం మొర్రి, అంగిలి విచ్చేదనం తదితర ఇబ్బందులతో భాధ పడుతున్న చిన్నారులకు శుభవార్త. వారికీ ఉచితంగా చికిత్సలు చేసేందుకు కెనడాకు చెందిన వైద్య బృందం ముందుకొచ్చింది. ఆరు నెలల నుంచి 15 ఏళ్ళలోపు బాలబాలికలకు ఈ చికిత్సలు చేయనున్నారు. ఇందుకోసం 27 మందితో కూడిన వైద్య బృందం శనివారం హైదరాబాద్ చేరుకొంది. హైదరాబాద్ పురానాహవెలీలొని ప్రిన్సెస్ దుర్రె ఫర్ చిల్డ్రన్స్ జనరల్ ఆసుపత్రిలో చిన్నారులకు ఆ ఉచిత చికిత్సలు చేయనున్నట్లు అంతర్జాతీయ మనవ హక్కుల సంస్థ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాజన్ ముదిరాజ్ తెలిపారు. కెనడాకు చెందిన ది ఆపరేషన్ రెయిన్బో అనే సంస్థ అద్వర్యంలో వీటికి సంభందించిన ఏర్పాట్లు చేశారు. శాస్త్రచికిత్సలతో పాటు వాటికి కావలసిన వైద్య పరీక్షలు, మందులు కూడా ఉచితంగా అందజేస్తారు. ప్లాస్టిక్ సర్జన్లు, చిన్న పిల్లల వైద్య నిపుణులు, అనస్తిషియన్లతో కూడిన బృందం ఈ నెల 27 వరకు హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారు. శస్త్రచికిత్సలు అవసరమైన పిల్లల తల్లి తండ్రులు రిజిస్ట్రేషన్ల కోసం 040-24520548, 24526155 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు
Thursday, 27 September 2018
మలబద్దకం నిరోధించుట కొరకు సులభ యోగాలు
ఈ మధ్యకాలం లో చాలా మంది ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మలవిసర్జన కు వెళ్తున్నాం మాకు మలబద్దకం లేదు అని అనుకుంటున్నారు . కాని అది సరియయినది కాదు . ఆరోగ్యవంతమైన మానవుడు రోజుకి రెండు సార్లు మలవిసర్జన చేయవలెను అని ఆయుర్వేద గ్రంథాలలో స్పష్టంగా ఉంది.
మలబద్దకం అనేది మానవ శరీరంలో వ్యాధులు ప్రారంభం అవుటకు మొదటి మెట్టు . మలబద్దకం ప్రారంభం అయిన వెంటనే గ్యాస్ సమస్య కూడా మొదలు అవుతుంది. కావున మలబద్ధకం అనే సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరించుకోవలెను .
ఈ మలబద్దకం అనే సమస్య పరిష్కరించుకొనుటకు కొన్ని సులభ పద్దతులు మీకు తెలియచేస్తాను .
పద్దతులు :
1. మిరియాలను నూరి చూర్ణం చేసి అరటిపండుతో అద్దుకొని భుజిస్తే మలబద్దకం తగ్గును. చిటికెడు మిరియాల చూర్ణం చాలు .
2. తెల్ల తెగడ ఆయుర్వేద షాపుల్లో దొరకును . దానిని పాలల్లో ఉడికించి ఎండబెట్టి చూర్ణం చేసి అణా ఎత్తు చూర్ణాన్ని అనుదినం సేవిస్తున్న యెడల మలబద్దకం పోతుంది .
3. మాచిపత్ర ఆకుల కషాయం తాగుతున్న మలబద్దకం నివారణ అగును.
4. సీతాఫలం వేరు నూరి ఆ రసాన్ని తీసి తాగిన సుఖవిరేచనం అగును.
5. కాకరకాయ కూర భోజనంలో కొంచంగా తింటూ ఉంటే సుఖవిరేచనం అవుతుంది.
6. ఎండిన ఎర్ర రేగిపళ్ళు గాని , వాటి వడియాలు గాని తింటూ ఉంటే సుఖవిరేచనం అగును.
7. ప్రతిపూటా కొంచం చింతపండు తింటూ ఉన్నా సుఖవిరేచనం అగును. ఎక్కువ తినినచో విరేచనాలు అగును. అందుకే మలబద్దకం లేకుండా ఉండుటకు రోజూ చాలా మంది భోజనంతో చింతపండు చారు కప్పుడు తాగుతారు.
8. బాగుగా మిగుల పండిన అరటిపండ్లు మూడు అరటిపండ్లు తినినచో సుఖవిరేచనం అగును. పచ్చి అరటిపండు తింటే విరేచనాలు తగ్గును.
9. నాగజెముడు , ఆకుజెముడు , బొంతజెముడు వీటిలో ఏ రకమైన జెముడు రసం పది చుక్కలు తీసుకుంటే విరేచనాలు అవుతాయి . అయిదు చుక్కల మోతాదు సరిపోతుంది.
10. ఇంగువ కుంకుడు గింజ అంత లొపలికి తీసుకున్నచో కడుపులో ఉన్న మలం అంతా బయటకి వెళ్లి కడుపు శుభ్రం అగును.
11. సునాముఖి చూర్ణం ఒక చెంచా మోతాదు నిద్రకు ఉపక్రమించబోయే సమయాన ఒక గ్లాస్ గొరువెచ్చటి నీటిలో కలిపి తీసుకున్నచో ఉదయానికి సుఖవిరేచనం అయ్యి వ్యర్థాలు బయటకి వెళ్లును.
మీ ఆహరం యొక్క అరుగుదల , మీ యొక్క మోషన్ సిస్టం సక్రమంగా ఉంచుకున్నచో మీకు అనారోగ్య సమస్యలు అంతతొందరగా దరిచేరవు .
Thursday, 14 June 2018
Tuesday, 29 May 2018
Tuesday, 28 November 2017
నిమ్స్ యాప్!
*
📣నిమ్స్ యాప్!*
*
*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*సమయం, డబ్బు ఆదా*
*

- డాక్టర్ మనోహర్, నిమ్స్ డైరెక్టర్
Subscribe to:
Posts (Atom)
-
బెంగళూర్,హైద్రాబాద్, చెన్నై లోని ఆరోగ్యశ్రీ కిందకు వచ్చే ఆసుపత్రుల వివరాలు.. అందరికీ షేర్ చేయండి. ...
-
27 వరకు గ్రహణ మొర్రికి ఉచిత శస్త్రచికిత్సలు పుట్టుకతోనే గ్రహణం మొర్రి, అంగిలి విచ్చేదనం తదితర ఇబ్బందులతో భాధ పడుతున్న చిన్నారులకు శుభవార...
-
ఈ మధ్యకాలం లో చాలా మంది ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మలవిసర్జన కు వెళ్తున్నాం మాకు మలబద్దకం లేదు అని అనుకుంటున్నారు . కాని అది సరియయినది కా...
Featured post
నిమ్స్ యాప్!
* 📣 నిమ్స్ యాప్!* * 🚸 క్యూలైన్ ఉండదు.. అంతా ఆన్‌లైన్* * 📱 మీ మొబైల్ నుంచే ఓపీ రిజిస్ట్రేషన్* * ♦ రిపోర్టుల కోసం చుట్టూ తిరగక్కర్...